Ponguleti Srinivasa Reddy: జైలు భయంతోనే బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:07 AM
జైలుకెళ్లాల్సి వసస్తుందన్న భయంతోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు
ఆ రెండూ ఒకే తానుముక్కలు: మంత్రి పొంగులేటి
కూసుమంచి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జైలుకెళ్లాల్సి వసస్తుందన్న భయంతోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 2లక్షల టన్నుల యూరియా ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. అవన్నీ కుంటి సాకులంటూ కొట్టిపారేశారు. ఖమ్మంజిల్లా కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమావేశంలో మంత్రి మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు ఏడు చువ్వలు లెక్కపెట్టకుండా ఉండాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలని తాము మొదటి నుంచీ చెపుతూ ఉన్నామని అన్నారు.