Kishan Reddy: జన్‌ధన్ యోజనతో ఆర్థిక సాధికారత
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:08 AM
దేశ ప్రజల ఆర్థిక సాధికారత, ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపయోగపడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల ఆర్థిక సాధికారత, ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపయోగపడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన ప్రారంభించిన సమయంలో దేశంలోని అనేక మంది బడుగు, బలహీన, పేద ప్రజలకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం 2014 ఆగస్టు 28నప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను అమల్లోకి తెచ్చారని వెల్లడించారు. 11 ఏళ్లలో జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్ల సంఖ్య 56 కోట్లకు పెరగగా.. అందులో ఖాతాదారులు జమచేసుకున్న మొత్తం రూ.2.68 లక్షల కోట్లు అని వెల్లడించారు. తెలంగాణలో జన్‌ధన్ యోజనలో భాగంగా 1.3 కోట్ల అకౌంట్లు తెరవగా.. అందులో ఖాతాదారులు రూ.5,055.35 కోట్లు జమ చేసుకున్నారని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ పర్యవేక్షక కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కమిటీని ఏర్పాటు చేశారు. బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.