నేడు పీజీఈసెట్-2025 నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:04 AM
అర్హతలు, కోర్సులు, ఫీజులు.. తదితర వివరాల కోసం అభ్యర్థులు పీజీఈసెట్.టీజీసీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా సూచించారు.
హైదరాబాద్ సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీఈసెట్)2025 నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ డాక్టర్ ఎ. అరుణకుమారి తెలిపారు. ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హతలు, కోర్సులు, ఫీజులు.. తదితర వివరాల కోసం అభ్యర్థులు పీజీఈసెట్.టీజీసీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా సూచించారు.