పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:11 AM
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీ జు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నల్లగొండ టౌన, జనవరి 3(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీ జు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎసీ,్ట బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా వేల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. వెంటనే పెండింగ్ బకాయిలన్నింటి నీ విడుదల చేయాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 20వేల స్కాలర్‌షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలని, ఇంటర్మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రేటు రూ.15వేలు పెంచాలని అ న్నారు. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులందరికీ రూ.20లక్షల ఉపకార వేత నం ఇవ్వాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌లో రూ. 200 కోట్లకు పెంచి అన్ని ఉద్యోగాల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సావిత్రీబాయి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీసీ యు వజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్నకుమార్, బీసీ సంక్షేమ సం ఘం జిల్లా కోశాధికారి జేరిపోతుల రమే్‌షగౌడ్, నాయకులు పుట్ట వెంకన్నగౌడ్, పున్నా రవీందర్, శ్రీనివాస్, పగిళ్ల కృష్ణ, మల్లెబోయిన సతీష్ యాద వ్, భరద్వాజ్, శివ, మత్స్యగిరి, మోహన, గణేష్ తదితరులు పాల్గొన్నారు.