Nagababu: రాజ్యసభకు నాగబాబు?
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:12 AM
ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దరిమిలా ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటివరకు అంతా భావించారు.

జనసేన ప్రతిపాదన.. ఆమోదించిన సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగబాబుకు శాసన మండలి సభ్యత్వం కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దరిమిలా ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటివరకు అంతా భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన జనసేన నుంచే రావడంతో టీడీపీ అధినేత అందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వాటిలో ఒక స్థానం నాగబాబుకు ఖాయమని తొలుత అనుకున్నారు. కానీ ఆయన రాజ్యసభ వైపు మొగ్గు చూపడంతో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నాగబాబును నిలపాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని నిలుపుతుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆ సీటును నాగబాబుకు ఇచ్చేపక్షంలో.. ఆయనకు కేటాయిద్దామనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అడిగే అవకాశాలు ఉన్నాయి..