Share News

శేషవాహన సేవలో పార్వతీ పరమేశ్వరులు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 AM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరులు శేషవాహన సేవతో ఇక్షుగిరులపై ఊరేగారు. ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై కల్యాణ శోభతో మెరిసిపోతున్న నవదంపతులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఆసీనులను గావించారు.

శేషవాహన సేవలో పార్వతీ పరమేశ్వరులు
శేషవాహన సేవతో ఊరేగుతున్న పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరులు శేషవాహన సేవతో ఇక్షుగిరులపై ఊరేగారు. ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై కల్యాణ శోభతో మెరిసిపోతున్న నవదంపతులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఆసీనులను గావించారు. ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివన్మామస్మరణలు, సన్నాయి వాయిద్యాలు చేస్తుండగా ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ సహార్చకులు శ్రీకాంత్‌ శర్మ, సురేశ్‌శర్మల మంత్రోఛ్చారలతో శేవవాహన సేవతో పార్వతీ పరమేశ్వరులు కొండపై ఊరేగారు. అనంతరం ఆలయంలో గవ్యాంత పూజలు, సూర్య నమస్కారాలు, దీక్షా హోమాలు, రుద్రహోమం, బలిహారణ, సదస్యం వేదస్వస్తి, సరస్వతీ పూజ, రుద్రాభిషేకం, ఆంజనేయునికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఈ ఉత్సవంలో దేవస్థాన ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, లింగయ్య, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:17 AM