Share News

Heat Stroke: తెలంగాణలో 348 వడదెబ్బ కేసులు

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:44 AM

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 7,192 మంది వడదెబ్బకు గురవ్వగా.. 14 మంది మృత్యువాత పడ్డారు.

Heat Stroke: తెలంగాణలో 348 వడదెబ్బ కేసులు

  • దేశవ్యాప్తంగా 7,192 కేసులు.. 14 మంది మృతి

న్యూఢిల్లీ, జూలై 27: దేశవ్యాప్తంగా ఈ ఏడాది 7,192 మంది వడదెబ్బకు గురవ్వగా.. 14 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రాల వారీగా తెలంగాణలో 348 కేసులు నమోదవ్వగా.. ఆంధ్రప్రదేశ్‌లో 4,055, రాజస్థాన్‌లో 373, ఒడిశాలో 350, మధ్యప్రదేశ్‌లో 297 వడదెబ్బ కేసులు రికార్డయ్యాయి. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో ఎన్‌సీడీసీ (వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం) మార్చి 1వ తేదీ నుంచి జూన్‌ 24వ తేదీ వరకు నమోదైన వివరాలను వెల్లడించింది.


ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ వందకుపైగా వడదెబ్బ కేసులు నమోదైనప్పటికీ ఆ రాష్ట్రాల్లో మరణాలు రికార్డవ్వలేదు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో ముగ్గురేసి చొప్పున వడదెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వాస్తవంగా వడదెబ్బ బాధితుల సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో నమోదైన కేసుల సమాచారాన్ని మాత్రమే ఎన్‌సీడీసీ వెల్లడించిందంటున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 04:44 AM