Share News

Osmania Medical College: రాష్ట్ర సాధనలో వైద్యగర్జన పాత్ర మరువలేనిది

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:29 AM

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2010లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు వైద్య గర్జన నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉస్మానియా వైద్య కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

Osmania Medical College: రాష్ట్ర సాధనలో వైద్యగర్జన పాత్ర మరువలేనిది

  • ఉస్మానియా వైద్యగర్జన ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు

హైదరాబాద్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2010లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు వైద్య గర్జన నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉస్మానియా వైద్య కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడికల్‌ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేష్‌, ప్రత్యేక అతిథిగా తెలంగాణ పబ్లిక్‌ హెల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కత్తి జనార్థన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2010లో వైద్య గర్జన సభ నిర్వహించిన నాయకులను సత్కరించారు.


నాటి పరిస్థితులు, ఉద్విగ్న క్షణాలను వక్తలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్‌ దుర్గా కిరణ్‌ మాట్లాడుతూ వైద్య గర్జన గురించి చరిత్రలో లేకుండా చేశారని, నాటి స్ఫూర్తిని ముందుకు కొనసాగించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్‌ బొంగు రమేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో వైద్యుల పాత్ర మరవలేనిదన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించకుండానే రాష్ట్ర సాధన పోరాటాలు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు, పూర్వ ఉద్యమ నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 04:29 AM