సెల్‌టవర్ సామగ్రి చోరీ కేసులో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:16 AM
సెల్‌టవర్లను టార్గెట్ చేసి చాకచక్యంగా సామగ్రిని కాజేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు.

సెల్‌టవర్ సామగ్రి చోరీ కేసులో ఒకరి అరెస్టు
వాహన తనిఖీలో పోలీసులకు చిక్కిన దొంగ
జిల్లాలో 16 చోరీల్లో ప్రమేయం
మిర్యాలగూడ అర్బన, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సెల్‌టవర్లను టార్గెట్ చేసి చాకచక్యంగా సామగ్రిని కాజేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంకటాద్రిపాలెం వద్ద వాహన తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రూరల్‌పోలీస్ స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ లోకే్‌షకుమార్ వివరాలు తెలిపారు. మిర్యాలగూడ మండలం ధీరావతతండాకు చెందిన ధీరావత నవీన అనేవ్యక్తి కొంతకాలంగా డివిజన పరిధిలో సంచరిస్తూ గ్రామశివారులో ఉన్న సెల్‌టవర్ల సామగ్రి చోరీకి పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఈనెల 4వ తేదీన ఐలాపురం గ్రామశివారులో ఎయిర్‌టెల్ సెల్‌టవర్‌కు చెందిన రేడియో రిమోట్ యూనిట్ (ఆర్‌ఆర్‌యూ) పరికరాల చోరీకి పాల్పడినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. గత ఏడాది జూన, జూలై మాసాల్లో శ్రీనివాసనగర్, నందిపాడు గ్రామాల శివారులోని ఎయిల్‌టెల్ సెల్‌టవర్ల ఆర్‌ఆర్ యూనిట్లను చోరీ చేసినట్లుగా తమ విచారణలో తేలిందన్నారు. కొన్నాళ్లుగా సెల్‌టవర్ల ఆర్‌ఆర్‌యూనిట్లను చాకచక్యంగా కాజేసి, వాటిని హైదరాబాద్‌లో విక్రయించి సొమ్ముచేసుకుని జల్సాలు తీర్చుకుంటున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ నేరాల్లో పెనపహాడ్ మండలం ధర్మాపురం తండాకు చెందిన లకావతు వెంకన్న అనే స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పతున్నాడు. ఐలాపురం గ్రామశివారులోని సెల్‌టవర్ ఆర్‌ఆర్ యూనిట్లను దొంగిలించి శ్రీనివాసనగర్ గ్రామశివారులోని చెట్ల పొదలో దాచిపెట్టి హైదరాబాద్‌లో విక్రయించేందుకు సోమవారం తెల్లవారుజామున తన ద్విచక్రవాహనంపై తరలిస్తూ తమకు పట్టుబడినట్లు ఎస్‌ఐ తెలిపారు. సెల్‌టవర్ సెక్యూరిటీ గార్డు యాకూబ్‌పాషా ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అతని వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువైన ఆర్‌ఆర్ యూనిట్లు, చోరీలకు ఉపయోగించే కట్టర్, స్పానర్‌లతో పాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు లకావతు వెంకన్న పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే పోలీసులకు చిక్కిన నవీనపై మిర్యాలగూడ రూరల్ పోలీ్‌సస్టేషన పరిధిలో ఐదు కేసులు నమోదై ఉండగా, జిల్లాలోని కొండమల్లేపల్లి, చింతపల్లి, తిరుమలగిరిసాగర్, నిడమనూరు, నేరేడుగొమ్ము, మాడ్గులపల్లి, దేవరకొండ, వేములపల్లి పోలీ్‌సస్టేషన్ల పరిధిలో మరో 11 చోరీ కేసులు నమోదై ఉన్నట్లు రూరల్ ఎస్‌ఐ తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న నవీనపై సస్సెక్ట్ షీట్ ఓసెన చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.