భూముల విలువల పెంపుపై వారంలో తేల్చేస్తాం
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:49 AM
భూముల మార్కెట్ విలువల పెంపుపై గత ఏడాది ఏప్రిల్ నుంచి కసరత్తు జరుపుతున్న అధికారులు.. ఎట్టకేలకు సర్కారుకు ప్రతిపాదనలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు
భూముల మార్కెట్ విలువల పెంపుపై గత ఏడాది ఏప్రిల్ నుంచి కసరత్తు జరుపుతున్న అధికారులు.. ఎట్టకేలకు సర్కారుకు ప్రతిపాదనలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. భూముల మార్కెట్ విలువల పెంపువిషయమై వారం రోజుల్లో శాఖాపరంగా తుది నిర్ణయం తీసుకుంటామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తామని..
ఆ తరువాత సర్కారు సూచనల ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఈ వారంలో మంత్రి వద్ద విలువల పెంపుపై ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ తరువాత ఇవే ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు తీసుకెళ్లనున్నారు. ఆయనతో చర్చించాక మార్పులు, చేర్పుల అనంతరం విలువల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశముందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.