Officials Caught Drinking: ఇరిగేషన్ అధికారుల జల్సాలు.. డ్యూటీ వదిలి మందు పార్టీ..
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:37 AM
Officials Caught Drinking: సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇరిగేషన్ ఆఫీస్‌కు వెళ్లారు. పోలీసులను చూడగానే అధికారులు అక్కడినుంచి వెళ్లిపోవాలని చూశారు. డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కొంతమంది ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ ఆఫీస్‌ను బార్‌గా మార్చేశారు. డ్యూటీ వదిలేసి ఆఫీస్‌లోనే మందు పార్టీ చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో గత వర్ష కాలంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా ఇరిగేషన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పలువురు ఇరిగేషన్ అధికారులకు ఉన్నతాధికారులు రాత్రి డ్యూటీ వేశారు.
రాత్రి సమయంలో విధులలో ఉండాలని ఆదేశించారు. అయితే, అధికారులు మాత్రం ఉన్నతాధికారుల మాటల్ని పెడచెవిన పెట్టారు. డ్యూటీ వదిలి ఇరిగేషన్ కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ కోసం ఇరిగేషన్ కార్యాలయాన్ని బార్‌గా మార్చేశారు. ఈ మందు పార్టీపై పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇరిగేషన్ ఆఫీస్‌కు వెళ్లారు. పోలీసులను చూడగానే అధికారులు అక్కడినుంచి వెళ్లిపోవాలని చూశారు. డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. డ్యూటీ సమయంలో.. అది కూడా ఆఫీస్‌లో మందు పార్టీ చేసుకున్న అధికారులపై చర్యలకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి..
పరువునష్టం దావా వేయబోతున్న మెలానియా ట్రంప్!