Share News

NTR Statue Unveiled in Nacharam: భద్రాద్రి జిల్లా నాచారంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:26 AM

ప్రపంచం నలుమూలలా తెలుగుజాతి ఖ్యాతి చాటిచెప్పిన ఎన్టీఆర్‌ కడుపున పుట్టడం తన అదృష్టమని..

NTR Statue Unveiled in Nacharam: భద్రాద్రి జిల్లా నాచారంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

  • ఎన్టీఆర్‌ బాటలోనే చంద్రబాబు: నందమూరి రామకృష్ణ

అశ్వారావుపేట/దమ్మపేట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలా తెలుగుజాతి ఖ్యాతి చాటిచెప్పిన ఎన్టీఆర్‌ కడుపున పుట్టడం తన అదృష్టమని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎన్నో జన్మల పుణ్యమని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావు విగ్రహాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ యుగ పురుషుడని, ఆయన బాటలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి ఆత్మాభిమానం కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని రామకృష్ణ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే కొనసాగిస్తున్నారన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 04:26 AM