Telangana Development: రూ.80 వేల కోట్లు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:01 AM
తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని
సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం
సీఎంకు తెలిపిన సీఎండీ గురుదీప్ సింగ్
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఎన్టీపీసీ తెలిపింది. శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టుల్లో సుమారు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు గురుదీప్ సింగ్ వివరించారు. ఫ్లోటింగ్ సౌర విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ఎన్టీపీసీకి అన్ని విధాల సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.