Share News

జగిత్యాల మున్సిపాలిటీలోకి నూకపల్లి అర్బన్‌ కాలనీ

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:01 AM

జగిత్యాల పట్టణం లోని 4500 మంది పేదలకు నిర్మించిన నూకపల్లి అర్బన్‌ హౌజింగ్‌ కాలనీని త్వరలో జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

జగిత్యాల మున్సిపాలిటీలోకి నూకపల్లి అర్బన్‌ కాలనీ
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

జగిత్యాల మున్సిపాలిటీలోకి నూకపల్లి అర్బన్‌ కాలనీ

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల పట్టణం లోని 4500 మంది పేదలకు నిర్మించిన నూకపల్లి అర్బన్‌ హౌజింగ్‌ కాలనీని త్వరలో జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం పట్టణం లోని 6, 7, 8 వార్డులలో రూ.కోటి 5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అర్బన్‌ కాలనీని జగిత్యాల మున్సిపల్‌లో కలిపే ప్రక్రియ తుది దశలో ఉందని, గవర్నర్‌ సంతకం అయిపోయిందని, గెజిట్‌ రాగానే మున్సిపల్‌లో కలిపివేస్తామన్నారు. పట్టణంలో ఒక్కో వార్డులో ఇప్ప టికే రూ.కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చే పట్టామని, ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టే ముందు లే అవుట్‌ ప్రకా రం చేయాలన్నారు. అమృత్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మంచినీరు అందజేయడం కోసం పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా మంచి కార్యక్రమమన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ అడువాల జ్యోతి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీని వాస్‌, మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, కమిషనర్‌ చిరంజీవి, కౌన్సి లర్లు కొలగాని ప్రేమలత, పల్లెపు రేణుక, మల్లవ్వ, పంబాల రాము కుమార్‌, కూతురు రాజేష్‌, కో ఆప్షన్‌ సభ్యులు శ్రీనివాస్‌, నాయకులు పల్లెపు మొగిలి, తిరుమలయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు ఆర్యవైశ్య సంఘం మద్దతు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో ప్రవర్తించిన తీరును జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కిరాణ వర్తక సంఘం సభ్యులు, ఎఫ్‌ఎంసీజీ సభ్యులు ఖండించారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఆయనను కలిసి మ ద్దతు పలికారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశ లు కృషి చేస్తూ సౌమ్యుడిగా పేరుగాంచిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌ పట్ల కౌశిక్‌ రెడ్డి అనుసరించిన తీరు సరి కాదన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసినవారిలో ఉన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 01:02 AM