Share News

NIMS: నిమ్స్‌లో ఎంహెచ్‌ఎం కోర్సులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 03:55 AM

నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ ).. 2025 సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సులో 20 సీట్లలో ప్రవేశానికి దరఖాస్తులు అహ్వానిస్తోంది.

NIMS: నిమ్స్‌లో ఎంహెచ్‌ఎం కోర్సులు

  • జూన్‌ 28 వరకు దరఖాస్తుకు అవకాశం

నిమ్స్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ ).. 2025 సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సులో 20 సీట్లలో ప్రవేశానికి దరఖాస్తులు అహ్వానిస్తోంది. రెండున్నరేళ్ల కోర్సులో భాగంగా చివరి 6 నెలల పాటు ఇంటర్న్‌షి్‌పకు హాజరుకావాల్సి ఉంటుంది.


ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది జూన్‌ 28 అని, దరఖాస్తు హార్డ్‌ కాపీని జూలై 2 లోగా అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 040- 2348 9189 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 03:55 AM