Share News

Mahabubnagar News: నిన్ననే పెళ్లి.. నవ వరుడి జీవితంలో ఊహించని విషాదం..

ABN , Publish Date - May 20 , 2025 | 03:11 PM

Mahabubnagar News: నిన్న ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. ఈ రోజు రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో రిసెప్షన్ మొదలవ్వనుంది. నరేష్ కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా.. షాక్‌కు గురయ్యాడు.

Mahabubnagar News: నిన్ననే పెళ్లి.. నవ వరుడి జీవితంలో ఊహించని విషాదం..
Mahabubnagar News

ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలీదు కానీ.. వధువు కాళ్ల పారాణి ఆరకముందే పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురు కట్టుకున్న కలల సౌధం పేక మేడలా కూలిపోయింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే పెళ్లి కుమారుడు చనిపోయాడు. రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందు వరుడు విగత జీవిలా మారాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పెను విషాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా, బయ్యారం మండలం, కోడిపుంజుల తండాకు చెందిన25 ఏళ్ల ఇస్లావత్ నరేష్, అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల జాహ్నవికి పెళ్లి నిశ్చయం అయింది.


నిన్న ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిగింది. ఈ రోజు రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో రిసెప్షన్ మొదలవ్వనుంది. నరేష్ కరెంట్ మోటార్ ఆన్ చేస్తుండగా.. షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నరేష్ చనిపోవటం జాహ్నవి తట్టుకోలేకపోయింది. కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. నరేష్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నరేష్ పెళ్లి రిసెప్షన్ రోజే కన్నుమూయటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఇవి కూడా చదవండి

Bhopal Shocker: అమ్మ బాబోయ్.. 7 నెలల్లో 25 మంది మగాళ్లను పెళ్లి చేసుకుంది..

Pawan Kalyan: రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం

Updated Date - May 20 , 2025 | 05:29 PM