New Roads Across Hyderabad: అవసరమైన ప్రతిచోటా కొత్త రోడ్లు
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:50 AM
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అవసరమైన ప్రతి చోటా ఆధునిక రోడ్లు వేస్తున్నామని నగర ఇన్‌చార్జి
వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు: పొన్నం ప్రభాకర్
నగర ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు: కిషన్‌రెడ్డి
ముషీరాబాద్‌లో 1.60 కోట్లతో సీసీ రోడ్డు పనులు
ముషీరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అవసరమైన ప్రతి చోటా ఆధునిక రోడ్లు వేస్తున్నామని నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను ఆధునికీకరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సాగర్‌లాల్ ఆస్పత్రి చౌరస్తా నుంచి దాయారం మార్కెట్ వరకు రూ.కోటి 60 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై వర్షపునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వరద నీటి నాలాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా అధికారు లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం చాలా పెద్దదని, అభివృద్ధి పనులకు నిధు ల లేమి వల్ల అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయన్నారు. అధికారులు దృష్టి సారించి అధిక నిధులు కేటాయించాలని కోరారు.