Share News

16 నుంచి ‘నేరడ’ పెద్దగట్టు జాతర

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:04 AM

చిట్యాల మండలం నేరడలో కొలువైన లింగమంతుల పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుం చి 18వ తేదీ వరకు జరగనున్నది.

 16 నుంచి ‘నేరడ’ పెద్దగట్టు జాతర
నేరడలోని శ్రీలింగమంతుల స్వామి దేవాలయం

16 నుంచి ‘నేరడ’ పెద్దగట్టు జాతర

చిట్యాలరూరల్‌: చిట్యాల మండలం నేరడలో కొలువైన లింగమంతుల పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుం చి 18వ తేదీ వరకు జరగనున్నది. సూర్యాపేట జిల్లాలో జరిగే పెద్దగట్టు జాతర సమయంలోనే నేరడలోని పెద్దగట్టు జా తరను కూడా నిర్వహించనున్నారు. ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ప్రారంభించారు. 18న గంగాదేవి అమ్మవారి బోనాల ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు మాణిక్యమ్మ, ఆకుమంచమ్మ, లింగమంతులస్వామి, ఎలమంచమ్మ, చౌడమ్మతల్లి, గంగమ్మతల్లి, రే ణుక ఎల్లమ్మతల్లి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్లకొకసారి జరి గే లింగమంతులస్వామి జాతరను వేద మం త్రోచ్ఛారణలు, భక్తుల భక్తిశ్రద్ధల నడుమ యా దవుల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించనున్నారు. జాతర ప్రారంభం సందర్భం గా 16న మొదటి రోజు సాయంత్రం ఫలహార పు బండ్లను గుట్టపైకి తీసుకెళ్లనున్నారు. మరునాడు 17న స్వామివారి కల్యాణ మహోత్సవం, బోనాల సమర్పించనున్నారు. కల్యాణం పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 18న గంగాదేవి అమ్మవారి బో నాల ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో జాతరను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 01:04 AM