ఏ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని సంకల్పించలేదు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:41 AM
శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని సంకల్పించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలో నుంచి బ యటకు తీసుకురావాలని ఈ ఆలోచన చేసిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
రాయికల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని సంకల్పించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలో నుంచి బ యటకు తీసుకురావాలని ఈ ఆలోచన చేసిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ పట్ట ణంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 శాసన సభ ఎన్నికల్లోపల ఎన్నికల లబ్ధి పొందే ఆలోచనతోనే జీవోను పక్కనబెట్టి సాగుకు సంబంధం లేకుండా ఇస్తున్నామని, గుట్టలకు, పుట్టలకు లే అవుట్‌లు చేసి ఇళ్ల నిర్మాణం చేసిన స్థలాలకు రైతుబంధు ఇచ్చారన్నారు. రైతుబంధు లక్ష్యం అనేది రైతులకు పెట్టుబడి రూపకంగా సహాయం చేయాలనే భావనతో రూపొందించారన్నారు. గతంలో రైతులకు ఇచ్చే వ్యవసాయ పని ముట్లు, సీడ్స్ సబ్సిడీలు తొలగించి నగదు రూపాన రైతుకు పెట్టుబడి సమకూర్చాలని జీవో నెం. 231 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని, జీవో ప్రకారం సాగు భూమికి మాత్రమే రైతుబంధు నిధులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఎన్నికల కోసం అప్పటి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో జీవోకు భిన్నంగా అప్పటి కలెక్టర్‌లు, వ్యవసాయ శాఖ అధికారులు సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చార న్నారు. ఆ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. ఎన్నికలు రావడంతో రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచడం, సాగుకు సంబంధం లేకుండా ఉన్న భూమికి పెట్టుబడి సహాయం అందించారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు ఏవైనా అర్మతకు అనుగు ణంగా, సక్రమంగా వినియోగపడాలని అన్నారు. రైతు భరోసానే కేబినేట్‌లో చర్చ జరుగుతుందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా చూస్తామన్నారు. రాయికల్ మండలంలోని జగన్నాథ్‌పూర్ వంతెన గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.