Share News

నత్తనడకన విస్తరణ పనులు

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:27 AM

జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తున్నాయి. వాహనాలు రాంగ్‌ రూట్‌ లో వస్తుండటంతో ప్రజలు భయంభయంగా వెళ్లాల్సి వస్తుం ది.

 నత్తనడకన విస్తరణ పనులు
నల్లగొండ బస్టాండ్‌ సమీపంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారి

నత్తనడకన విస్తరణ పనులు

నల్లగొండ పట్టణంలో సా..గుతున్న పనులు

వాహనాల రాంగ్‌ రూట్ల రాకతో ఇబ్బందులు

భయాందోళనలో పట్టణ ప్రజలు

సకాలంలో పూర్తి చేయాలని వేడుకోలు

నల్లగొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనాలు ఇష్టానుసారంగా వెళ్తున్నాయి. వాహనాలు రాంగ్‌ రూట్‌ లో వస్తుండటంతో ప్రజలు భయంభయంగా వెళ్లాల్సి వస్తుం ది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పట్టణ ప్ర జలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి గొల్లగూడెం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఎడతెగని జాప్యం జరుగుతుంది. అదేవిధంగా విద్యుతశాఖ, ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం నుంచి నేతాజీ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా కాలం తర్వాత మొదలైన విస్తరణ, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కాకపోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి సాగుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బస్టాండ్‌ దగ్గర ఉండటంతో ఆ ర్టీసీ డ్రైవర్లు కూ డా ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటించకుండా వాహనాలను నడుపుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్‌ వాహనదారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన జంక్షన్లు, రోడ్డు విస్తరణ పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆలస్యంగా సాగుతున్నా యి. మునిసిపల్‌ అధికారులు ప ర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ నుంచి గొల్లగూడ వర కు రోడ్డు అంతా గుంతలమయం గా మారింది. మునిసిపల్‌, విద్యుతశాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రోడ్డు విస్తరణకు మధ్యలో ఉన్న స్తంభా ల తొలగింపు ఆలస్యమవుతుంది. దీంతో విస్తరణ పనులు ముందు కు సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలే రోడ్డు విస్తరణ కోసం మట్టి తొలగింపుతో పాటు ఇతర పనులను చేపట్టారు. డ్రైనేజీ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినా వేగవంతంగా సాగడం లేదు.

విస్తరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

అధికారులు రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలి. పట్టణంలో ట్రాఫిక్‌ పెరిగింది. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. బస్టాండ్‌ వద్ద జంక్షన చుట్టూ పనులతో పాటు రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలి.

ఎన.యాదయ్య, నల్లగొండ

వాహనాలు అడ్డగోలుగా నడుపుతున్నారు

విస్తరణ పనులు సాగుతుండటంతో ప్రభుత్వ వాహనాల తో పాటు ప్రైవేట్‌ వాహనాలు ట్రాఫిక్‌ నిబంధనలకు వి రుద్ధంగా నడుపుతున్నారు. బస్టాండ్‌ నుంచి గొల్లగూడ వరకు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. బస్టాండ్‌ నుంచి బ యటికి వెళ్తున్న బస్సులు జంక్షన చుట్టూ తిరిగి వెళ్లకుండా హైదరాబాద్‌ రోడ్డు వైపు రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నాయి. దీంతో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు పనులు త్వరితగతన పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలి.

ఎం.మధు, నల్లగొండ

Updated Date - Jan 17 , 2025 | 12:27 AM