Share News

వీఆర్‌ఎస్‌ తీసుకున్న నరేంద్రరావు

ABN , Publish Date - May 30 , 2025 | 04:55 AM

ఆహార కమిషన్‌లో సభ్య కార్యదర్శి గా పని చేస్తున్న నరేంద్రరావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగులసంఘం అధ్యక్షుడిగా పదేళ్లపాటు కొనసాగిన ఆయన్ను..

వీఆర్‌ఎస్‌ తీసుకున్న నరేంద్రరావు

  • సచివాలయ సంఘం అధ్యక్షుడిగా 10 ఏళ్లు సేవలు

హైదరాబాద్‌, మే28(ఆంధ్రజ్యోతి): ఆహార కమిషన్‌లో సభ్య కార్యదర్శి గా పని చేస్తున్న నరేంద్రరావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగులసంఘం అధ్యక్షుడిగా పదేళ్లపాటు కొనసాగిన ఆయన్ను.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఫుడ్‌కమిషన్‌ సభ్య కార్యదర్శి గా బదిలీ చేసింది. అంతకు ముందు ఆయన సచివాలయంలో రెవెన్యూశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసేవారు.


ఏఎస్‌వోగా సచివాలయ సర్వీసులోకి వచ్చిన నరేంద్రరావుసెక్షన్‌ అధికారిగా, సహాయ కార్యదర్శిగా, డిప్యూటీ కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా పదోన్నతులు పొందారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి పదేళ్లుగా సచివాలయ ఉద్యోగులసంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు.

Updated Date - May 30 , 2025 | 04:55 AM