జాతీయ స్థాయి సైన్స్ పోటీలకు నానో ట్రాక్టర్
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:07 AM
తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్నిచ్చే నానో ట్రాక్టర్‌ను తయారు చేసిన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రామాపురం మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రద ర్శన జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైంది. పాఠశాల పదో తర గతి విద్యార్థులు లూనావతు అఖీల్, భానోతు తరుణ్ గైడ్ టీచర్ కోట

తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్నిచ్చే నానో ట్రాక్టర్ తయారు చేసిన మోడల్ స్కూల్ విద్యార్థులు, ఢిల్లీ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన
తుర్కపల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్నిచ్చే నానో ట్రాక్టర్‌ను తయారు చేసిన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రామాపురం మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రద ర్శన జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైంది. పాఠశాల పదో తర గతి విద్యార్థులు లూనావతు అఖీల్, భానోతు తరుణ్ గైడ్ టీచర్ కోట నవీన్ పర్యవేక్షణలో నానో ట్రాక్టర్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేశారు. ఈ ప్రాజెక్టును 2024 సెప్టెంబరులో భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సైన్స్ మేళాలో ప్రాజెక్టు ఉత్తమ అవార్ఢుకు ఎంపికై రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 7న హైద్రాబాద్‌లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో 33జిల్లాల నుంచి 33 ప్రాజెక్టులు ప్రదర్శించగా, ఈ ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్పోర్ట్స్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నుంచి విద్యార్థులు ప్రశంసాపత్రం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి సైన్ పోటీలకు ఎంపికైన ఏకైక ప్రాజెక్టు ఇదే.
ఢిల్లీ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ పోటీలకు..
దేశ రాజదాని ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్-2025 సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తాము రూపొందించిన ఎలక్ట్రిక్ నానో(మినీ) ట్రాక్టర్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను వివరిం చారు. అంతకుముందు విద్యార్థులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. విద్యార్థులను ప్రిన్‌పాల్ అంబటి శోభారాణి, టీచర్లు అభినందించారు.
నానో ట్రాక్టర్ తయారీ విధానం
ప్రస్తుత తరుణంలో వ్యవసాయ కూలీలు లేకుండా వ్యవసాయం చేయాలేని పరిస్థితి రైతులకు నెలకొంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్నిచ్చే ఎలక్ర్టిక్ నానో టాక్టర్‌ను మోడల్ స్కూల్ విద్యార్థులు లూ నావతు అఖీల్, భానోతు తరుణ్ గైడ్ టీచర్ కోట నవీన్ పర్యవేక్షణలో నానో ట్రాక్టర్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేశారు. పడేసిన చేతక్ (స్కూటర్) నుంచి ముందు వీల్, హ్యాండిల్‌ను తీసుకుని కారుకు వాడే బ్యాటరీలతో ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్‌ను తయారు చేశారు. . దీనికి పెట్టు బడి రూ.30వేలు అయినట్లు తెలిపారు. ఈ నానో ట్రాక్టర్ డీజిల్, పెట్రోల్ అవసరం లేకుండానే బ్యాటరీ సహాయంతో నడుస్తుందన్నారు. ఈ యంత్రంతో పొలంలో దుక్కి దున్నుకోవచ్చునని, పొలంలో కలుపు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అంతర్ పంటల్లో కలుపుతో బరువులు తీసుకపోవడడానికి ఉపయోగపడుతుందన్నారు. పంటలకు స్ర్పే చేయ డానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ట్రాక్టర్ చేసే పనులన్నింటినీ దీంతో చేసుకోవచ్చునని తెలిపారు.