యాదగిరిక్షేత్రం.. భక్తజనసంద్రం
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:18 AM
యాదగిరిగుట్ట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఉభయ క్యూలైన్లు, ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి.
యాదగిరిగుట్ట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఉభయ క్యూలైన్లు, ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి. ఇష్టదైవాల దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు వాహనాలపై తరలివచ్చారు. 52 వేల మంది భక్తులు నృసింహుడిని దర్శించుకోగా, ప్రత్యేక, ధర్మదర్శనం క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో రద్దీ కొనసాగింది. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం రాజభోగం (ఆరగింపు) మూడు గంటల పాటు ఉభయ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ. 55.16లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు. స్వామిని ఎంబీసీ కార్పొరేషన (తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సంస్థ) చైర్మన జెరిపేటి జైపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకుని గర్భాలయంలోని స్వయంభువుల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితు లు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. వారిని ఆదివారం సాధారణ పరిపాలన కార్యదర్శి (సెక్రటరీ జనరల్ అడ్మినిస్ర్టేషన) రఘునందన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేయగా స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
కొండపై ఈవో అకస్మిక తనిఖీలు
లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఈవో ఎస్. వెంకట్రావు అకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీ కేంద్రం, ప్యాకింగ్, అమ్మకాలు, పారిశుధ్య విభాగాలను పరిశీలించి అధికా రులకు తగిన సూచనలు చేశారు. భక్తులకు అందించే ఉచిత ప్రసాద వితరణకు అధునిక యంత్ర పరికరాలు తెచ్చేందుకు అధికారులను ఆదేశించారు. తక్కువ ధరలకు రెస్టా రెంట్ అందుబాటులోకి తేవాలని ఈవో దృష్టికి భక్తులు తెచ్చారు.