Share News

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:25 AM

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభి వృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజ్‌సనందలాల్‌ పవార్‌

నల్లగొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభి వృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్యభవన్‌లో బుధవారం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్లగొండ, సూ ర్యాపేట, యాదాద్రి భు వనగిరి జిల్లాల అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్ట ర్లు, అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా రు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా తో డ్పాడునందిస్తుందని, సీజన్‌లో ఎరువుల సరఫరా లో ఇబ్బందుల్లేకుండా ప్రతిరోజూ మండలస్థాయిలో అధికారులు సమీక్ష చేయాలన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ, రైతుభరోసా వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నామని, ధాన్యానికి బోనస్‌ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్‌ పథకాలు వేగవంతంగా పూర్తిచేయడానికి అధికారయంత్రాంగం కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి రైతులకు ఇబ్బందిలేకుండా ప్రజాప్రతినిధులు సూచించిన ప్రకారం తక్షణమే అంచనా వేసి సీఎండీకి నివేదిస్తే, తాము ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్‌ శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నేనావత్‌ బాలూనాయక్‌, వేముల వీరేశం, మందుల సామేల్‌, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజ్‌సనంద్లాల్‌ పవార్‌, డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, మూడు జిల్లాల అన్ని శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

సస్యశ్యామలం చేస్తాం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి

ఉమ్మడి జిల్లాలో అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణను వేగవంతం చేయాలి. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీవోలు నిరంతరం నిర్వాసితులతో మాట్లాడి భూసేకరణ పూర్తిచేయిస్తేనే పథకాలు పూర్తవుతాయి. అటవీశాఖ అనుమతుల విషయంలోనూ కలెక్టర్లు ప్రత్యేకచొరవ తీసుకోవాలి. రాబోయే మూడున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో భూసేకరణ సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు నా చుట్టూ, సెక్రటేరియట్‌ చు ట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదు. బ్రాహ్మణవెల్లంల పెండింగ్‌ బిల్లుల మంజూరుకు కృషి చేస్తాం. త్వరలో ఈ పనులు పూర్తవుతాయి. ఏఎమ్మార్పీహైలెవల్‌ కెనాల్‌ ఆధునీకీకరణకు రూ.400 కోట్లు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు మొదలవుతాయి. డిండి ప్రాజెక్టు గురించి, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. డిండి లిఫ్ట్‌కు నీటి వసతి లేదని, నేను మంత్రి అయ్యాకే రూ.1800 కోట్లు మంజూరు చేసి, ఏదుల నుంచి నీటి వసతి కల్పించా. ఈ పనులకు టెం డర్ల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నెల్లికల్‌ ఎత్తిపోతల పథకం మొదటిదశ ను వేగంగా పూర్తిచేయాలి.భూసేకరణ విషయంలో అధికారులు మానవీయ దృక్పథం లో వ్యవహరించి, వాస్తవ మార్కెట్‌ ధరకు అనుగుణంగా ధర చెల్లించేలా చూడాలి.

జిల్లాకు అత్యధిక నిధులు : రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా నిధులు మంజూరు చేస్తు న్నాం. భవిష్యత్‌లోనూ అన్నిశాఖల ద్వారా ఉమ్మడి జిల్లా అభ్యున్నతికి తోడ్పాడునందిస్తాం. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్ల నిధులు మంజూరు చేశాం. నల్లగొండ- మల్లేపల్లి, దేవరకొండ-డిండి రోడ్లను విస్తరించే పనులు చేపట్టాం. చిట్యాల-భువనగిరి-జగదేవ్‌పూర్‌ రోడ్డుని కూడా హ్యామ్‌ పద్ధతిలో చేపడుతున్నాం. జిల్లాకేంద్రంల కలెక్టరేట్‌ అదనపు బ్లాక్‌ నిర్మాణాన్ని రూ.8కోట్లతో నిర్మించాం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జిల్లాకు ఎక్కువ సమయం కేటాయించాలి.

Updated Date - Jul 03 , 2025 | 12:25 AM