Share News

కూలీల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - May 21 , 2025 | 12:26 AM

ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి సి ర్పంగి స్వామి డిమాండ్‌ చేశారు.

కూలీల సమస్యలను పరిష్కరించాలి

వలిగొండ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి సి ర్పంగి స్వామి డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏపీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్‌లో వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటూ కూలీలకు కనీస సౌకర్యాలు అందలేని పరిస్థితులు ఏర్పాడ్డాయని విమర్శించారు. పనిచేస్తున్న కూలీలకు పేస్లి్‌పలను ఇవ్వడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన కూలీ ఎంత అని అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. మండలంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎండాకాలంలో ఇచ్చే సమ్మర్‌ అలవెన్స పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏపీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాలు, లక్ష్మయ్య, పోచయ్య, యాదయ్య, మణెమ్మ, ఎట్టమ్మ, వనజ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:26 AM