మాటలేనా..? అభివృద్ధి ఉందా?
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:33 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మా టలే ఉన్నాయని చేతలు మాత్రం (అభివృద్ధి పనులు) లేవని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జోకర్‌లా మాట్లాడుతున్న ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
మోత్కూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మా టలే ఉన్నాయని చేతలు మాత్రం (అభివృద్ధి పనులు) లేవని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచితాలు బంద్ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి వాటి ని నిలిపి వేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి బ్రోకర్ లా, ఎమ్మెల్యే మందుల సామేలు జోకర్‌లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టా రు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే సామేలు 15 నెలలు గడిచినా కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులేమీ లేవన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సామేలు హరీ్‌షరావు ఇంటి చుట్టూ తిరిగి బతిమిలాడుకుంటే ఆయన అప్పటి సీఎం కేసీఆర్‌కు చెప్పి ఆయనకు గిడ్డంగుల చైర్మన్ పదవి ఇప్పించారన్నారు. నాడు గిడ్డంగుల చైర్మన్ పదవి ఇవ్వడంవల్లే ఈ రోజు కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిందన్న విషయం ఆయన మర్చిపోయారన్నారు. ఎమ్మెల్యే సామేలు బీఆర్‌ఎస్ నేతలను తిట్టడం మాని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలన్నారు.
ఇప్పటికే మీ కార్యకర్తలే మిమ్ములను గ్రామాల్లోకి రానివ్వడం లేదు, ఇక మేము కూడా తోడైతే మీరు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేరన్నా రు. సమావేశంలో బీఆర్‌ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షు లు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మోత్కూరు పట్టణ అధ్యక్షు డు జంగ శ్రీనివాస్, మార్కెట్ మాజీ చైర్మన్లు కొనతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, మాజీ సర్పంచ్ ఆర్.నాగయ్య, నాయకులు కొండా సోంమల్లు, గజ్జి మల్లేష్, సామ పద్మారెడ్డి పాల్గొన్నారు.