ఆందోళనలో మహిళా ఏఈవోలు!
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:38 AM
సూర్యాపేట జిల్లాలో మండల వ్యవసాయాధికారుల తీరు చర్చనీయాంశమైంది. మహిళా ఏఈవోలను వేధింపులకు గురిచేస్తూ తుంగతుర్తి డివిజనలో ఇద్దరు ఏవోలు సస్పెండ్‌కు గురయ్యారు.
సూర్యాపేట జిల్లాలో 60 ఏఈవోల పోస్టులు ఖాళీ
ఉన్న వారిపై తీవ్ర పనిఒత్తిడి
సూర్యాపేట జిల్లాలో మండల వ్యవసాయాధికారుల తీరు చర్చనీయాంశమైంది. మహిళా ఏఈవోలను వేధింపులకు గురిచేస్తూ తుంగతుర్తి డివిజనలో ఇద్దరు ఏవోలు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ ఉదంతం మహిళా ఏఈవోల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు పలువురు మహిళా ఏఈవోలు ఆవేదన చెందుతున్నారు. అయితే బహిరంగంగా చెప్పుకోవడానికి జంకుతున్నారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా ఏదో వంకతో మండల స్థాయి అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-భానుపురి)
తుంగతుర్తి డివిజనలోని తుంగతుర్తి ఏవో బాలకృష్ణ, నూతనకల్ ఏవో మురళీబాబులు మహిళా ఏఈవోలో అసభ్యంగా ప్రవర్తించడంతో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ సస్పెన్షన వేటు వేశారు. ఈ ఘటనపై ఐదుగురు అధికారులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ మహిళా ఉద్యోగుల నుంచి వివరాలను సేకరించి కలెక్టర్‌కు అందజేసింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విధులకు దూరప్రాంతాలకు వెళ్లే ఏఈవోలు ఒంటరిగా వెళ్లడానికి సైతం జంకుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 84 మంది ఏఈవోలు ఉండగా అందులో 53 మంది మహిళా ఏఈవోలు ఉన్నారు. వ్యవసాయ శాఖలో ఎక్కువ మంది మహిళలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు 14మంది వరకు అవుట్‌సోర్సింగ్ ఏఈవోలు సైతం ఉన్నారు. వీరిపై మండల నుంచి పైఅధికారుల వరకు పనిభారం పెం చుతూ పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
పని ఒత్తిడిలో ఏఈవోలు
నిబంధనల ప్రకారం ఒక్కో ఏఈవోకు 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండాలి. అయితే సూర్యాపేట జిల్లాలో 60 ఏఈవో పోస్టులు ఖాళీలు ఉండడంతో వివిధ చోట్ల అదనంగా బాధ్యతలు అప్పగించారు. కొన్నిచోట్ల ఒక్కొక్క ఏఈవోకు 7 నుంచి 8 వేల ఎకరాల వరకు వ్యవసాయ భూములను కేటాయించారు. పని ఒత్తిడిలో ఎక్కడో ఒకచోట తప్పులను చూపి పైస్థాయి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వానాకాలం, యాసంగి సీజనలలో ఐకేపీ, పీఎసీఎస్, ఎనడీసీఎంఎ్‌స, మార్కెట్లలో రైతులు తీసుకువచ్చిన ధాన్యం తేమశాతం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది.
అయితే ఒక్కొక్కరికీ నాలుగు నుంచి ఐదు కేంద్రాలను కేటాయించడంతో మహిళా ఏఈవోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఈవోలు సాధారణంగా పంటల వివరాలు సేకరించడం, రైతు బీమా, రైతుబంధు లాంటి వివరాలను ఎప్పటికప్పుడు ఆనలైనలో నమోదు చేసే బాధ్యతలు చేపడుతున్నారు. అదేవిధంగా రైతులు వేసిన పంటల వివరాలు ఇలాంటివి చూడాల్సి ఉంది. ఒక్కొక్కరిపై పనిఒత్తిడి రెండింతలు ఉన్నట్లు మహిళా ఏఈవోలు తెలిపారు.
మహిళా ఏఈవోలు భయపడాల్సిన అవసరం లేదు
మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. కలెక్టరేట్‌లో ఉమెన సెల్లార్ కమిటీ విభాగం ఉంది. అక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఏఈవోలకు ఇబ్బంది ఉన్నట్లు తమ దృష్టికి రాలేదు. ఐదుగురితో కూడిన మహిళా కమిటీని కలెక్టర్ నియమించడంతో విచారణ చేపట్టడంతో ఇద్దరు ఏవోలపై సస్పెన్షన వేటుపడింది.
శ్రీఽధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి