Share News

శివారు కాలనీలపై శీతకన్ను

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:18 AM

(ఆంధ్రజ్యోతి- మిర్యాలగూడ టౌన్‌) మిర్యాలగూడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండడంతో పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగు తోంది. దీంతో పట్టణ పరిధి కూడ విస్తరిస్తుంది.

 శివారు కాలనీలపై శీతకన్ను

(ఆంధ్రజ్యోతి- మిర్యాలగూడ టౌన్‌)

మిర్యాలగూడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండడంతో పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగు తోంది. దీంతో పట్టణ పరిధి కూడ విస్తరిస్తుంది. కానీ శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణంలో 48వార్డులుండగా ఈదులగూడ, హైదలాపురం, తాళ్లగడ్డ, ఇందిరమ్మ కాలనీ, రవీంద్రనగర్‌, ఏడుకోట్లతండా తదితర కాలనీల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా కాలనీల్లో నూతన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ రహదారులు ఏర్పాటు చేయకపోవడం, తాగునీటి పైప్‌లైన్లు వేయకపోవడంతో రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అడవిని తలపించెలా పొదలు, పిచ్చి చెట్లు పెరడంతో క్రిమికీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని, దోమలు వ్యాప్తి చెం దుతున్నాయి. ఇక డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఒంపు ప్రాంతాలకు చేరుతోందని, అక్కడక్కడా వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారగా అవస్థలు పడుతున్నామని, పాలకులు అధికారులు వార్డుల్ల పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:18 AM