Share News

కేజీబీవీ ప్రారంభమెప్పటికో..?

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:51 AM

కొండమల్లేపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సొం త భవనం కోసం నాలుగేళ్లుగా నిరీక్షించారు. నిర్మాణం పూర్తయ్యిందన్న సంతోషం ఒక వైపు.. రేకుల షెడ్డులో తాము పడ్డ అవస్థలు తీరి పోతా యని అనుకున్న విద్యార్థినుల కల మాత్రం సాకా రం కావడం లేదు.

 కేజీబీవీ ప్రారంభమెప్పటికో..?

కొండమల్లేపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సొం త భవనం కోసం నాలుగేళ్లుగా నిరీక్షించారు. నిర్మాణం పూర్తయ్యిందన్న సంతోషం ఒక వైపు.. రేకుల షెడ్డులో తాము పడ్డ అవస్థలు తీరి పోతా యని అనుకున్న విద్యార్థినుల కల మాత్రం సాకా రం కావడం లేదు. ఏడాదిలో పూర్తి కావాల్సిన కొం డమల్లేపల్లి కేజీబీవీ భవనం నిర్మాణం పూర్తి చేసు కోవడానికి నాలుగేళ్ల కాలం పట్టగా.. నాలుగేళ్లకు నిర్మాణం పూర్తి చేసుకొని నాలుగు నెలలు గడుస్తు న్నా కొండమల్లేపల్లి కేజీబీవీ ఇంకా విద్యార్థినులకు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థినులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

రేకుల షెడ్డులో విద్యాభ్యాసం

మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఓ ప్రైవేటు రేకుల షెడ్డులో 6 నుంచి 10వ తరగతి వరకు కేజీబీవీని నిర్వహిస్తున్నారు. ఆ షెడ్డులో మౌ లిక వసతులు లేకపోవడంతో విద్యార్థినులు ఇ బ్బందుల నడుమ విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున దాదాపు 220 మందివిద్య నభ్యసిస్తుండగా అద్దె భవనం రేకుల షెడ్డు కావడంతో అరకొర వస తులతో విద్యార్థినులు ఇబ్బందులకు తదితర సమ స్యలతో ఇప్పటికే సుమారు 30 మంది వరకు విద్యార్థినులు టీసీలు తీసుకొని వేరే పాఠశాలలో చేరారు. దీనికి తోడు వేసవి కావడం రేకుల షెడ్డులో తీవ్రమైన ఉక్కబోతతో విద్యార్థినులు సతమత మవుతున్నారు.

రేకుల షెడ్డులో కొనసాగుతున్న కేజీబీవీకి ఆకతాయిల చేష్టలు విసుగు తెప్పిస్తుండడంతో పాటు విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేసు ్తన్నాయి. గతేడాది అద్దె భవనంలోకి ఓ ఆకతాయి చొర బడడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనతో కంగారుపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు సైతం ఇక్కడ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రహరీ సరిగా లేకపోవడంతోనే ఆకతాయిలు ఇక్కడ విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకతాయిల చేష్టలతో విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను అద్దె భవనంలో ఉంచేందుకు జంకుతున్నారు.

అధికారుల ఉదాసీనత

సొంత భవనం ఏర్పాటుకు గత ప్రభుత్వం రూ. 3.35 కోట్లు మంజూరు చేయగా 2021లో అప్పటి మంత్రి జగదీశరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదటి రెండేళ్లు నిర్లక్ష్యంతో నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం జరగ్గా.. స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాల ఒత్తిడితో గతేడాది డిసెంబర్‌ నాటికి ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. నిర్మాణం పూర్తయి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇన్నాళ్లు సొంత భవనం లేక ఇబ్బందిపడిన విద్యా ర్థినులు భవన నిర్మాణం పూర్తయినప్పటికీ తమకు అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం జరు గుతోంది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు అస హనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉదా సీన తను విడి భవనాన్ని ప్రారంభించి విద్యార్థినుల కషా ్టలను తొలగించాలని కోరుతున్నారు.

నీటి సరఫరా లేకపోవడంతో ఆలస్యం

కొండమల్లేపల్లి కేజీవీబీ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కానీ నీటి సరఫరా కాక పోవడంతో ప్రారంభించడంలో ఆలస్యం అవుతుంది. ఉన్నతాధికారులతో ఈ విషయమై ఇప్పటికే వివరించాం. సాధ్యమైనంత త్వరలోనే నీటి వసతి కల్పించి కొండమల్లేపల్లి కేజీవీవీని ప్రారంభిస్తాం.

- నాగేశ్వర్‌రావు, ఎంఈవో, కొండమల్లేపల్లి

Updated Date - Mar 13 , 2025 | 12:51 AM