Share News

మూసీ ప్రక్షాళన ఏమైంది?

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:30 AM

సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం నవంబరు 8న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మూసీ నది ప్రక్షాళనకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ప్రశ్నించారు. గురువారం భువనగిరిలో జరిగిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

మూసీ ప్రక్షాళన ఏమైంది?

సీఎం వాగ్దానానికే దిక్కులేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

భువనగిరి టౌన్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం నవంబరు 8న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మూసీ నది ప్రక్షాళనకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ప్రశ్నించారు. గురువారం భువనగిరిలో జరిగిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం అండ్‌ కంపెనీ చెబుతున్న 42శాతం బీసీ రిజర్వేషన్‌ కాదని, అ ది ముస్లిం రిజర్వేషన్‌ అని విమర్శించారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద రేవంత్‌రెడ్డి ఫ్లాప్‌షోను గ మనించే ఆ పార్టీ అధినాయకులు డుమ్మా కొట్టారని ఎద్దేవా చేశారు. 10 శాతం ముస్లిం కోటాను తొలగిస్తే 42శాతం బీసీ రిజర్వేషన్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. జిల్లాలో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బోణీ కొట్టాలన్నారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడికి క్రేన్‌ సా యంతో భారీ గజమాలతో కార్యకర్తలు సత్కరించారు. మహిళా కార్యకర్తలు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బండారు లోకేష్‌, శివశంకర్‌ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్‌, ఊట్కూరి అశోక్‌గౌడ్‌, పాశం భాస్కర్‌, జి.ప్రేమేందర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్‌, వేముల అశోక్‌, పట్నం రోజ, సుర్వి లావణ్య, నల్ల నర్సింగ్‌రావు, మాయ దశరథ, చందా మహేందర్‌గుప్తా, బలరాం, సీహెచ్‌.సురే్‌షరెడ్డి, జె.శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్‌, మేడి కోటేష్‌, తాటికొండ రమేష్‌, పాల్గొన్నారు.

చేనేత కళాకారుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి

(ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్‌, యాదగిరిగుట్ట): ఎన్నికల సమయంలో చేనేత కళాకారులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గురువారం చేనేత దినోత్సవంలో భాగంగా గుట్టలో ఏర్పాటు చేసిన సభలో పలువురు చేనేత కళాకారులను సన్మానించారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కర్రె ప్రవీణ్‌, వట్టిపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, దాసరి మల్లేశం, రచ్చ శ్రీనివాస్‌, అచ్చయ్య, కర్నాటి ధనుంజయ్య, అన్నం శివకుమార్‌, పాల్గొన్నారు. తొలుత రాంచందర్‌రావు యాదగిరిగుట్ట నృసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేసి, చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకునేలా కృషి చేయాలని గుట్టలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మినర్సయ్య వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 08 , 2025 | 12:30 AM