యాదవ కళాకారులకు గుర్తింపేదీ..?
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:33 AM
వారు గ్రామీణ యాదవ కళాకారులు. తమ కు ఉన్న కళానైపుణ్యంతో గ్రామాల్లో యాదవ కులస్థులు తమ ఇళ్లలో పండుగలు జరుపుకునే సమయంలో కథలు చెబుతూ జీవనం సాగిస్తారు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ కళకు ఆదరణ తగ్గడంతో పాటు జీవనంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. అయితే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. - (ఆంధ్రజ్యోతి -తిరుమలగిరి రూరల్)
తిరుమలగిరి మండలం మామిడాల గ్రా మంలో 3,తుంగతుర్తి మండలం వెంపటిలో 3, నాగారం మండలం వర్ధమానుకోటలో 2, నూత నకల్‌మండలం మిర్యాలలో5, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 5 కుటుంబాల వారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 50 మంది యాదవులు కులస్థు లు. వీరు యాదవులు గ్రామాల్లో, ఇళ్లలో పండుగలు చేసుకునే సమయంలో కథలు చెప ుతూ దాదాపుగా 60 ఏళ్లు జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వ్యవసాయం లేక మొదటి నుంచి యాదవుల కథలైన పోతరాజు, పెద్దిరాజు, శ్రీ కృష్ణ జననం,కౌంససంర్ధన కాటమరాజు, ఆవుల మేపు ల కథ, గంగ తర్కవాదం లాంటి కఽథలు చెప్పి యాదవుల వద్ద నుంచి పైకం తీసుకొని జీవించేవారు. క్రమంగా అది తగ్గిపోయింది. ఇప్పుడు యాదవుల పండుగలైన లింగమంతుల జాతర సందర్భంగా సౌండమ్మ, ఎలమంచమ్మ అనే పం డుగలు ఎవరైతే యాదవులు చేస్తారో వారి ఇం టివద్ద చెప్పి వారు ఇచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ పండుగలు వేసవికాలంలో మాత్రమే జరుపుకోవడం వల్ల, మిగిలిన సమయంలో ఎలాంటి పనులు లేక అవస్థ లు పడుతున్నారు. వీరి జీవితం అంతా ఎండాకాలంపండుగలు జరిపి వర్షాకాలం అంతా సం పాదించిన డబ్బుతో జీవితం కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా మారని బతుకులు
మాకథలు రవీంద్రభారతి, శిల్పరామంలోనూ ప్రదర్శించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకుల్లో మార్పు లేదని యాదవ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం కళాకారులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించినా అవి మా వరకు రాలేదని, గత ప్రభుత్వ హ యాంలో బీసీ కమిషన్ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వచ్చి మా ఇంటి పరిస్థితులు చూసి కథ చెప్పించుకొని వెళ్లినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇంత కాలం పండుగలతో కాలం వెల్లదీసినా రానున్న కాలంలో మా జీవనం గడవడం ఇంకా కష్టత రం అవుతుందనిపిస్తోందని ఆందోళన చెందు తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవ నం గడుపుతున్నాము. మా వంటి కళాకారులకు పెన్షన్, బస్‌పాస్, ఇందిరమ్మ ఇంటిని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.