అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:00 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులను ఎంపిక చేయవద్దని వ్యవసాయశాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట(కలెక్టరేట్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులను ఎంపిక చేయవద్దని వ్యవసాయశాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి వ్యవసాయం, భూభారతి, ఇరిగేషన్, ఇందిరమ్మ ఇళ్లపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల మాట్లాడారు.
అందరి సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేయాలన్నారు. నల్లగొండ జిల్లా వ్యవసాయం, రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకోవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారు లు వెంటనే కలెక్టర్లకు తెలపాలన్నారు.రాష్ట్రంలో అన్ని జిల్లా ల్లో ఏఈవోల కొరత ఉందన్నారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈవోలు కావాలని మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన విజ్ఞ ప్తి మేరకు ఏఈవోలను నియమించుకునే అధికారం కలెక్టర్ల కు ఇచ్చామని, వెంటనే అవసరమైనంత మంది ఏఈవోల ను నియమించుకుని అనుమతి కోసం ప్రభుత్వానికి నివేది క పంపాలన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల ను ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో వరి పంట సా గును తగ్గించి ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోందన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల మధ్యలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు.
పారదర్శక పాలన అందించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రెవెన్యూ, పోలీ్‌సశాఖల్లో అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా పేదలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత పదేళ్లలో అధికారుల అలసత్వం, అవినీతి ఎక్కువగా ఉండేదని, కాం గ్రెస్ ప్రభుత్వంలో వాటన్నంటినీ విడనాడాలని హెచ్చరించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నా రు. గత ఏడాదితో పోలిస్తే 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేశామన్నారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా కస్టమ్ మిల్లింగ్ చేయించి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులోని ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల చొప్పులన ఉచితంగా అందిస్తున్నామన్నారు. గతంలో రేషన్ కార్డులు ఇవ్వకుం డా ప్రజలను ఇబ్బందుల కు గురి చేశారని, ప్రస్తుతం అడిగిన ప్రతీ ఒక్కరి కి రేషన్‌కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. రాను న్న ఐదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. డెన్మార్క్ నుంచి ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక టెక్నాలజీ తీసుకువచ్చి హెలీకాప్టర్ ద్వారా సర్వే చేయించి త్వరలోనే పనులు ప్రారంబిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పిలాయిపల్లి, బునాదిగానికాల్వ, ధర్మారెడ్డిపల్లి ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు, డిండి ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయసముద్రం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. త్వరలో నే ఆ పనుల ను కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దేవాదుల ఫేస్-3 ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకువస్తామన్నారు. నాగార్జునసాగర్ ఎత్తిపోతల, నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని ప్రాజెక్టులకు ఆయకట్టు ప్రణాళికలను సిద్ధం చేసి నీటి విడుదల విషయాలను ముందే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోయిందని, త్వరలో అన్ని ప్రాజెక్టుల్లోని పూడిక తీత పనులు ప్రారంభించి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మొదలు పెట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేస్తామని, నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తదితర పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పథకాల అమలులో ఎవరైనా అనర్హులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేటలో ఉన్న అటవీ భూములను రక్షించాలని అదే విధంగా అటవీ భూములు పచ్చదనంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులపై ఉందని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇస్తుండటంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వేలాది మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో 12లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రహదారుల నిర్మాణాలకు ఇప్పటికే రూ.1,700కోట్లు మంజూరు చేశామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే యాసంగిలో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా రైతులు పండించారన్నారు.