Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:50 AM

అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందజేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం, వెంకిర్యాల, రుద్రవెల్లి, రాఘవాపురం, చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో హెచ్‌ఎండీఏ, సీజీఎఫ్‌ , ఎస్‌సీసీఆర్‌ఆర్‌ నిధులు రూ16కోట్లతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి

బీబీనగర్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందజేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం, వెంకిర్యాల, రుద్రవెల్లి, రాఘవాపురం, చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో హెచ్‌ఎండీఏ, సీజీఎఫ్‌ , ఎస్‌సీసీఆర్‌ఆర్‌ నిధులు రూ16కోట్లతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి, చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారిస్తామని, అభివృద్ధిలో భువనగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గడ్డం బాలకృష్ణగౌడ్‌, సింగిల్‌విండో డైరెక్టర్లు చింతల శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్‌, గోళి పింగల్‌రెడ్డి, శ్యాంగౌడ్‌, సురకంటి సత్తిరెడ్డి, గోళి నరేందర్‌ రెడ్డి, ఆగమయ్య గౌడ్‌, సందిగారి బాస్వయ్య, పెంటయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:50 AM