నైపుణ్య ఇంజనీర్లను దేశానికి అందిస్తాం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:22 AM
నైపుణ్యాలు కలిగిన ఇంజనీర్లను దేశానికి అందించేలా కృషి చేస్తామని ఎంజీయూ ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని ఎంజీయూలో శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ఆవిష్కరణల ప్రదర్శనను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.
ఎంజీయూ ఉపకులపతి అల్తాఫ్ హుస్సేన
నల్లగొండ, జూన 27 (ఆంధ్రజ్యోతి): నైపుణ్యాలు కలిగిన ఇంజనీర్లను దేశానికి అందించేలా కృషి చేస్తామని ఎంజీయూ ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని ఎంజీయూలో శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ఆవిష్కరణల ప్రదర్శనను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. నైపుణ్యాలు కలిగిన మానవవనరుల ఉత్పత్తి లక్ష్యంగా స్థాపించిన ఎంజీ యూనివర్సిటీ లక్ష్యం దిశగా పయనానికి నేటి వైజ్ఞానిక ప్రదర్శన నిదర్శనమన్నారు. విద్యార్థులు తమ అధ్యాపకుల ప్రోత్సాహంతో చేసిన ఆవిష్కరణలు వారి సున్నితత్వానికి, సామాజిక స్పృహకు నిదర్శనమన్నారు. విశ్వ విద్యాలయ రూ.3.5లక్షల ఆర్థిక సహకారంతో ఎనిమిది మంది విద్యార్థుల సామర్థ్యం కలిగిన సోలార్ క్యాంపస్ కారును రూపొందించడం హర్షించదగ్గ విషయమన్నారు. నాలుగు గంటలు పూర్తి చార్జింగ్‌తో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నారు. అధునాత వాహనాల్లో ఉండే సౌకర్యాలను కల్పించడంలో విద్యార్థులు పడిన తపన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. క్యాంపస్ కారుతో పాటు ఆటోమెటిక్ ఫ్లోర్‌క్లీనర్, వాయిస్ కంట్రోల్ స్మార్ట్ డస్ట్‌బిన, ఫొటోగ్రఫిక్ క్లాక్, వీసీఆర్ బేస్డ్ రిప్రజేటర్, ఎమర్జెన్సీ అలర్ట్‌సిస్టమ్, ఆటోమెటిక్ కూలర్ కంట్రోల్ సిస్టమ్, ఎలకి్ట్రక్ స్కూటర్, సోలార్ గ్రాస్ కట్టర్, అంబులెన్స డ్రైవర్స్ ఉపయోగించే సిగ్నలింగ్, ఎలకి్ట్రక్ స్కూటర్ వంటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీహెచ.సుధారాణి, ఇనస్ట్రక్టర్ డ్రైవర్ ఆకుల రవి, డీన ఆచార్య రేఖ, మౌనిక, అవినాష్, జయంతి, నాగరాజు, మానేశ్వర్‌రావు, జ్యోతిరాణి, శ్రీనివా్‌సతో పాటు విద్యార్థులు, తదితరులు ఉన్నారు.