Share News

భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - May 05 , 2025 | 11:40 PM

ప్రతీ ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు యెల్లంల సంజీవరెడ్డి అన్నారు.

 భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి
మల్లన్న పండుగలో పాల్గొన్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు యెల్లంల సంజీవరెడ్డి తదితరులు

మోటకొండూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు యెల్లంల సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని మేడికుంటపల్లిలో వారం రోజులుగా జరుగుతున్న గ్రామాదేవతల పండుగల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి పండుగలో ఆయన ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్రాయి ఊరికి కాపలా అని, అలాంటి బొడ్రాయికి పూజలు నిర్వహించడం చాలా మంచిదన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తండ పాండురంగయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పన్నాల బుచ్చిరెడ్డి, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భాస్కరుని రఘునాథరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొంతం మోహనరెడ్డి, నెమ్మాని సుబ్రహ్మణ్యం, బాల్ద రామకృష్ణ, భూమండ్ల శ్రీనివాస్‌, జూకంటి మధు, పసల ప్రదీప్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:40 PM