Share News

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:24 AM

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ రాజకీయాలకతీతంగా భాగస్వాములు కావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
సరదాగా కల్లు తాగుతున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదానపోచంపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ రాజకీయాలకతీతంగా భాగస్వాములు కావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండల పరిధి లోని భూదానపోచంపల్లి-కొత్తగూడెం ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి నారాయణగిరి వయా మోడల్‌స్కూల్‌ రోడ్డు నిర్మాణానికి 1.1 కిలోమీ టర్‌ రోడ్డుకు రూ.1.10కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డుకు ఆయన శంకు స్థాపన చేశారు. జగతపల్లి నుంచి జంగంవారి గూడెం వరకు రోడ్డుకు 1.5కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అబ్దుల్‌ నగర్‌ నుండి రుద్రవెల్లి వయా కప్రాయిపల్లికి 4.8 కి.మీ రోడ్డుకు రూ. 3 కోట్ల 35 లక్షల నిధులతో నిర్మించే రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. వంకమామిడి గ్రామం నుంచి శేరిల్ల రోడ్డుకు 3.8 కిజమీ రోడ్డుకు రూ. 2కోట్ల 11 లక్షల నిధులతో నిర్మించే రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. నారాయణగిరి నుంచి దేశముఖి వరకు 5 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 3కోట్ల 67 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో రూ. 11 కోట్ల 60 లక్షల నిధులతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని 47మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధి దారులకు చెక్కులు పంపిణీ చేశారు. భూదానపోచంపల్లి పట్టణంలోని పెద్ద చెరువు కట్టకు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే మినీ ట్యాంక్‌ ని ర్మాణ పనులకు ఆయన పరిస్థితులు పరిశీలించి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు మార్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రేషన కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలను అర్హులందరికీ అందజేస్తామని అన్నారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయ కులు తడక వెంకటేష్‌, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదనరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, దారెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన సామ మోహ నరెడ్డి, కాంగ్రె్‌సపార్టీ మండల నాయకులు తడక రమేష్‌, పడమటి భూపాల్‌రెడ్డి, ఎం.అంబరీ్‌షరెడ్డి, ఉప్పునూతల వెంకటే్‌షయాదవ్‌, అనిరెడ్డి జగనరెడ్డి, పక్కీరు మల్లారెడ్డి, పక్కీరు నర్సిరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు లాలయ్య, మద్ది అంజరెడ్డి, కుక్క దానయ్య, నాయకులు గునిగంటి వెంకటే్‌షగౌడ్‌, కుక్క కుమార్‌, మక్తాల నర్సింహగౌడ్‌, సీత సుధాకర్‌, ఎజాస్‌, పెంట నవీన పాల్గొన్నారు.

వేసవిలో ఉపశమనం తాటి కల్లు : ఎమ్మెల్యే

మండుతున్న ఎండలకు వేసవిలో ఉపశమనం కోసం తాటి కల్లు శ్రేష్ఠమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా మండల పరిధిలోని శివారెడ్డిగూడెం-వంకమామిడి గ్రామాల మధ్య మూసీ బ్రిడ్జి వద్ద నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. అటుగా వెళుతున్న కల్లుగీత కార్మికులు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని కల్లు తాగాలని కోరగా ఎమ్మెల్యే తాటి కల్లును రేకతో తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన తాటి కల్లు వేసవికి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఆయన వెంట ఉన్న పలువురు కాంగ్రె్‌సపార్టీ నాయకులు సైతం కల్లు తాగారు.

Updated Date - Mar 11 , 2025 | 01:24 AM