గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:03 AM
గ్రామాల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వామి కావాలని ప్రభుత్వ విప్ అయిలయ్య అన్నారు.
బొమ్మలరామారం, జూన 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వామి కావాలని ప్రభుత్వ విప్ అయిలయ్య అన్నారు. బుధవారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం ప్రతి గ్రామాలన్ని అన్ని విధాల చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీ ని నెరవేర్చే విధంగా రేవంతరెడ్డి పనిచేస్తున్నారని అ న్నారు. బొమ్మలరామారం మండంలోని మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 42 మంది కి ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 500మందికి మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అనంత రం ఎస్సీ సబ్ ప్లాన కింద మంజూరైన నిధు ల ద్వారా ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి, సీసీ రోడ్లకు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన రాజేష్ పైలెట్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీత, మాజీ సర్పంచ గోవింద్, నాయకులు చీర సత్యనారాయణ, మరి భగవంతురెడ్డి, శ్రీరాములు నాయక్ పాల్గొన్నారు.