Share News

శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి

ABN , Publish Date - May 22 , 2025 | 12:17 AM

విద్యార్థులు శాస్త్రీయ విద్యావిధానం కోసం పోరాటాలు సాగించాలని ఎస్‌ఎ్‌ఫఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం.మమత కోరారు.

శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న మమత

ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత

చౌటుప్పల్‌ టౌన, మే 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు శాస్త్రీయ విద్యావిధానం కోసం పోరాటాలు సాగించాలని ఎస్‌ఎ్‌ఫఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం.మమత కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలో ఐదు రోజుల పాటు నిర్వహించే ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు రమేష్‌, సీపీఎం ప్రజా సంఘాల నాయకులు ఎ.గోవర్ధన, శివ, రాజు, పల్లె మధు, ముత్యాలు, నాగరాజు, తిగుళ్ల శ్రీనివాస్‌, పల్లె శివకుమార్‌, తడక మోహన, ఉదయ్‌, నరేందర్‌, బర్రె రాజు, నరసింహ, వరణ్‌, శివ, కార్తీక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:17 AM