Share News

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:23 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఎం ప్రజా ప్రతినిధులు ముందుండాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి
రాగిబావి ఉపసర్పంచను సన్మానిస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

మోత్కూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఎం ప్రజా ప్రతినిధులు ముందుండాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి ఉపసర్పంచగా ఎన్నికైన పానుగుళ్ల లక్ష్మీరమే్‌షను పార్టీ జిల్లా కార్యాలయంలో సన్మానించి, మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేషం, మోత్కూరు మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:23 AM