Share News

వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:37 AM

వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలో ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వయోధికులపై వేధింపుల వ్యతిరేక ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

భువనగిరి టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలో ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వయోధికులపై వేధింపుల వ్యతిరేక ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు మంజూరైన డేకేర్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతను సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌కు అప్పగిస్తామన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమాన్ని పిల్లలు విస్మరించరాదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూర్ణచందర్‌రాజు, ఎర్రగుం ట వెంకటేశం, నరాపోలు నర్సయ్య, కె.మోహన్‌రావు, సాల్వేర దశరథ, బండా రు భిక్షపతి, కరిపె నర్సింగ్‌రావు, కూచిపూడి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:37 AM