రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:13 AM
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని, విడతలవారీగా రైతులకు రైతు భరోసా నిధు లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరో సా ఇచ్చారు. రైతు భరోసా సంబురాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి
భువనగిరి రూరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని, విడతలవారీగా రైతులకు రైతు భరోసా నిధు లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరో సా ఇచ్చారు. రైతు భరోసా సంబురాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలంలోని అనాజీపురం రైతు వేదికలో కలెక్టర్ హనుమంతరావు రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వారం రోజుల్లో రూ.70లక్షల మంది రైతులకు రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 2,27,544 మంది రైతులకు రూ.288.90 కోట్ల నిధులను రైతు భరోసా పథకంలో భాగంగా జమ చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ ఎన్.అంజిరెడ్డి, ఏవో డి.మల్లేశ్, ఏఈవోలు ప్రసన్న, ప్రియాంక, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.
సకాలంలో పెట్టుబడి సాయం : తీన్మార్ మల్లన్న
యాదగిరిగుట్ట రూరల్: రైతులకు పెట్టుబడి సహాయం సకాలంలో అందించడం శుభపరిణామమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లి రైతు వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌ను ఆయన వీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, పాల్గొన్నారు.