Share News

శిథిలావస్థలో వాటర్‌ ట్యాంకు

ABN , Publish Date - May 15 , 2025 | 12:26 AM

భువనగిరి మండలం మేజర్‌ గ్రామపంచాయతీ అయిన చందుపట్ల గ్రామంలో 60వేల లీటర్ల సామర్ధ్యం గల ఓహెచఎ్‌సఆర్‌ వాటర్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది.

శిథిలావస్థలో వాటర్‌ ట్యాంకు
ట్యాంకు కింది భాగం పెచ్చులుడి ఇనుప చువ్వలు తేలిన దృశ్యం

భువనగిరి రూరల్‌, మే14 (ఆంధ్రజ్యోతి): భువనగిరి మండలం మేజర్‌ గ్రామపంచాయతీ అయిన చందుపట్ల గ్రామంలో 60వేల లీటర్ల సామర్ధ్యం గల ఓహెచఎ్‌సఆర్‌ వాటర్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. 1999 సంవత్సరంలో ప్రారంభించబడిన వాటర్‌ ట్యాంకు ప్రస్తుతం ట్యాంకు కింది భాగంలో, పిల్లర్లకు ఇనుప చువ్వలు తేలి ప్రమాదం పొంచి ఉంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది. నిర్మాణం పూర్తయి 26సంవత్సరాలు గడిచింది. శిథిలావస్థకు చేరిన వాటర్‌ ట్యాంకుకు మరమ్మతులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి

శిథిలావస్థకు చేరి ప్రమాదం పొంచి ఉన్న వాటర్‌ ట్యాంకుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తాను సర్పంచగా కొనసాగుతున్న తరుణంలో ఈ విషయమై జిల్లా స్థాయి గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో వాటర్‌ ట్యాంకుకు మరమ్మతులు చేపట్టి గ్రామస్థుల ప్రాణాలను కాపాడాలి.

-చిన్నం పాండు, మాజీ సర్పంచ, చందుపట్ల , భువనగిరి మండలం

నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేపడతాం

భువనగిరి మండలం చందుపట్లలో గత 26సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్‌ ట్యాంకుకు మరమ్మతులు చేపట్టేందుకు జడ్పీ ప్రత్యేక నిధులు రూ.2లక్షలు ప్రతిపాదించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేపడుతాం. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లాను.

-గుండురావు, ఆర్‌డబ్ల్యూఎ్‌స ఏఈ భువనగిరి

Updated Date - May 15 , 2025 | 12:26 AM