నాగులకుంటకు జల కళ
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:33 AM
చౌటుప్పల్ పట్టణం నడి బొడ్డున గల నాగుల కుంట జలకళను సంతరించుకుంది.
చౌటుప్పల్ టౌన, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ పట్టణం నడి బొడ్డున గల నాగుల కుంట జలకళను సంతరించుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి నాగులకుంటలోకి నీరు చేరుకుంది. ఈ కుంటలోని నీటితో భూగర్భ జలాలు పెరగనున్నాయి. దీంతో కుంట చుట్టు పక్కల ఉన్న ఇళ్లలోని బోరు బావులలో నీరు పెరిగే అవకాశం ఉండడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, బుధవారం మునిసిపల్ కమిఇషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి నాగుల కుంట, ఊర చెరువుల వద్దకు వెళ్లి కట్టల పటిష్టతను పరిశీలించారు.