Share News

ఓటింగ్‌ నమోదు శాతం పెంచాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:25 AM

ఓటింగ్‌ నమోదు శా తం పెంచాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు నమోదు చేసుకునే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.

ఓటింగ్‌ నమోదు శాతం పెంచాలి

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

బొమ్మలరామారం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఓటింగ్‌ నమోదు శా తం పెంచాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు నమోదు చేసుకునే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కు లోనుకాకుండా బోగస్‌ ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు. స్థానికంగా నివాసం ఉండే ప్రతీఒక్కరికి ఓటుహక్కు కల్పించాలన్నా రు.గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటుహక్కు నమోదు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అ లాంటి వారికి ఓటుహక్కుపై అవగాహన కల్పించి జాబితాలో నమో దు చేసుకునే విధంగా చూడాలన్నారు. అవసరమైతే పదో తరగతి పూర్తయిన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల నుంచి తీసుకొ ని వారి పుట్టిన రోజు ఆధారంగా ఓటు నమోదు చేయాలన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో 90శాతంపైగా పోలింగ్‌ జరిగిందని, అదే మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో కూడా పోలింగ్‌ శాతాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, మాస్టర్‌ ట్రైనర్స్‌ ఉపాధ్యాయులు, పోలింగ్‌ బూత్‌స్థాయు అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ లేకుండా చూడాలి..

రాజాపేట: భూభారతి దరఖాస్తుల పెండింగ్‌ లేకుండా చూడాల ని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. రాజాపేట తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి దరఖాస్తుల వివరాలను తహసీల్దార్‌ అనితను అడిగి తెలుసుకున్నారు.

వివిధ పనుల పై కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిపలు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. వంటశాల, డైనింగ్‌, స్టోర్‌ రూంలను, పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఆర్‌ఐ రమేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వేణుప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:25 AM