Share News

యాదగిరిక్షేత్రాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతం

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:38 AM

అత్యంత శక్తిమంతమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ భరత్‌ పరషార్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సిహెచ్‌ పంచాక్షరితో కలిసి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

యాదగిరిక్షేత్రాన్ని దర్శించడం  పూర్వజన్మ సుకృతం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

యాదగిరిగుట్ట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అత్యంత శక్తిమంతమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ భరత్‌ పరషార్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సిహెచ్‌ పంచాక్షరితో కలిసి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచనారసింహుడి ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఆలయంతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన ప్రశంసించారు. స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలపై ఎల్లవేళల ఉండాలని ఆకాంక్షించారు. ఆయనవెంట కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు, భువనగిరి జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవిలత, యాదగిరిగుట్ట జూనియర్‌ సివిల్‌ జడ్జి చండీశ్వరి, అదనపు కలెక్టర్‌ జి. వీరారెడ్డి, భువన గిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:38 AM