Share News

ఇరానపై అమెరికా దాడిని ఖండించాలి : సీపీఎం

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:49 PM

మిర్యాలగూడ, జూన 24(ఆంధ్రజ్యోతి): ఇరానపై అమెరికా దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన కోరారు.

ఇరానపై అమెరికా దాడిని ఖండించాలి : సీపీఎం

మిర్యాలగూడ, జూన 24(ఆంధ్రజ్యోతి): ఇరానపై అమెరికా దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన కోరారు. వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం యాద్గార్‌పల్లి వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరానలో అణుబాంబులు ఉన్నాయనే సాకుతో అమెరికా ఇరాన చమురు నిక్షేపాలపై, సంపదపై దాడులు చేస్తుందని ఆరోపించారు. అమెరికా ఇంటెలిజెన్స, నిఘా వర్గాలు స్పష్టంగా అణుబాంబులు లేవని చెప్పినప్పటికీ ట్రంప్‌ కావాలని తమ ఆధిపత్యం కోసం ఇరానపై యుద్దం చేస్తుందని విమర్శించారు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మూడో ప్రపంచ యుద్దం వచ్చేలా ఉందని అన్నారు. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు, చమురు ధరలు పెరుగుతాయని ఆప్రభావం పేద, మధ్యతరగతి ప్రజలపై పడుతుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి జ్యోకం చేసుకుని యుద్దాలను ఆపాలని, ప్రపంచంలో శాంతి నెలకొనేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు గౌతంరెడ్డి, బావాండ్ల పాండు, రవినాయక్‌, పాదూరి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:49 PM