పట్టణ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:12 AM
భువనగిరి పట్టణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్ డిమాండ్‌చేశారు.
భువనగిరి గంజ్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్ డిమాండ్‌చేశారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఎం రాజకీయ శిక్షణ తరుగుతులను నిర్వహించారు. ఈసందర్భంగా జ హంగీర్ మాట్లాడుతూ పట్టణంలో ఇంతవరకు టౌన హాల్ నిర్మించలేదని అన్నారు. రైల్వేస్టేషన ఆధునికీకరణ జరగలేదని, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదని అన్నారుజ బస్టాండ్ అధ్వాన్న స్థితిలో ఉందన్నారు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, భువనగిరి ఖిల్లా రోప్‌వే పనులకు అతీ గతీ లేదని అన్నారు. ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్‌లు పలు సమస్యలపై పట్టణ సుందరీకరణకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఉన్న 35వార్డుల్లో పలు సమస్యలపై సీపీఎం పోరుబాట ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. భువనగిరి పట్టణం జిల్లా కేంద్రమైన అబివృద్ధిలో వెనుకబడి ఉందని, గత బీఆర్‌ఎస్ నేడు కాంగ్రెస్ పాలనలో భువనగిరి అబివృద్ధి చెందడం లేదని అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పట్టణ సమస్యల పరిష్కారానికి సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, గద్దె నరసింహ, మాయ కృష్ణ, గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, కల్లూరి నాగమణి, బర్ల వెంకటేశం, వల్దాస్ అంజయ్య, దాసరి మంజుల, పర్వత బాలకృష్ణ, దిడ్డికాడి మైసయ్య, ఈర్ల రాహుల్, రియాజ్, కొత్త లక్ష్మయ్య, కొత్త లలిత పాల్గొన్నారు.