రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు
ABN , Publish Date - May 05 , 2025 | 11:48 PM
నల్లగొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధార్ తరహాలో 11అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డులను కేటాయించేందుకు (ఫార్మసీ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది.
నల్లగొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధార్ తరహాలో 11అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డులను కేటాయించేందుకు (ఫార్మసీ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. తొ లుత నెల రోజుల పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టనుండగా ఆ తరువాత మీ సేవా, ఏజెన్సీల ద్వారా ఈకార్యక్రమం కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఇక నుంచి ప్రామాణికం కా ను ంది. ప్రస్తుతం నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని 140కిపైగా రైతు వేదికల్లో ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతులకు 11 అంకెలతో ఉన్న గుర్తింపు కార్డును కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలైన పీఎం కిసాన్‌తో పాటు పంటలబీమా, మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాలను అమలు చేయనున్నారు. ఇప్పటివరకు సరియైున గణాంకాలు ఉన్న ధ్రు వీకరణ పత్రాలు నమోదు కాకపోవడం, వివరా లు లేకపోవడంతో రైతులకు సకాలం లో పథకాలు అందడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించి ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఉమ్మడి జిల్లాలో 10.27లక్షలకు పైగా రైతులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10,27,532 మంది రైతులు ఉన్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 5.40 లక్ష మంది, యాదాద్రి భువనగిరిలో 1,57,206 లక్షల మంది రైతులు, సూర్యాపేట జిల్లాలో 3,30,326 లక్షల మంది రైతులు ఉన్నా రు. వీరందకీ విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వ నున్నారు.. ఆగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. విశిష్ట గుర్తి ంపు సంఖ్య నమోదుకు భూ యజమాన్య పట్టదారు పాసుపుస్తకం ఆధార్, ఫోన్ నెంబర్‌తో వ ్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.అనంతరం లబ్ధిదారులకు ఓటీపీ వస్తుంది. దానిని ధ్రువీకరించుకున్న తరువాత రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో వచ్చే విడత నిధుల విడుదలకు దీనిని ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది.
వివరాల డిజిటలైజేషన్‌కు..
గతంలో అధికార యంత్రాంగం రైతుల వివరాలను డిజిటలైజేషన్ చేయడానికి సమస్యగా ఉండేది. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటన్నింటి పరిష్కారాలకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలల్లో నమో దు చేయగా తెలంగాణలో మాత్రం వాయిదా పడింది. తాజాగా ఆగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ పథకాలకు రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ ప్రక్రియలకు ఎలాంటి సం బంధ లేదని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యజమాన్య వివరాలే ప్రమాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొంది. మొత్తానికి విశిష్ట కార్డులు అందుబాటులోకి రానుండటంతో సమస్యలు తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. త్వరితగతిన విశిష్ట గుర్తింపుకార్డులను అందజేసేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఈ నెల రోజులు వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ఆ తరువాత మీసేవలు, ఏజేన్సీల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.