కంటివైద్య శిబిరానికి అనూహ్య స్పందన
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:11 AM
మునిపంపుల భగతసింగ్ విజ్ఞాన కేంద్రంలో దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్‌రెడ్డి పద్మ (ఎనఆర్‌ఐ) సహకారంతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి పొర చికిత్స శిబిరానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది.
నేటి నుంచి ఆపరేషన్లు ప్రారంభం
రామన్నపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మునిపంపుల భగతసింగ్ విజ్ఞాన కేంద్రంలో దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్‌రెడ్డి పద్మ (ఎనఆర్‌ఐ) సహకారంతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి పొర చికిత్స శిబిరానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగో రోజు చికిత్స శిబిరంలో 179 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. 80 మందికి ఆపరేషన కోసం పరీక్షలు నిర్వహించగా 30 మందికి ఆపరేషన కోసం అపాయింట్మెంట్ ఇచ్చారు. శిబిరం వద్ద 50మంది వలంటీర్లు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. కక్కిరేణి, ఎన్నారం, దుబ్బాక, లక్ష్మాపురం గ్రామాల ప్రజలు ఈరోజు చికిత్స పరీక్ష చేయించుకుని ఉచిత అద్దాలు తీసుకున్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ కోఆర్డినేటర్ భానుప్రకాష్, కార్యక్రమ సమన్వయకర్తలు తొలుపునూరి చంద్రశేఖర్, బొడ్డుపల్లి వెంకటేశం, గాదె శోభారాణి, అప్పం సురేందర్, గాదె కృష్ణ, జోగుల సాయి పాల్గొన్నారు.