Share News

బకాయిల భారం మోయలేం

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:15 AM

పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందు కు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది.

బకాయిల భారం మోయలేం

ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు ఆసుపత్రులు సన్నద్ధం

వారంలో నిధుల విడుదలకు, ధరల పునఃసమీక్షకు డిమాండ్‌

పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందు కు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. గతంలో రూ.5 లక్షల వరకు ఉన్న వైద్యసేవలను ప్రభుత్వం ఇటీవల రూ.10 లక్షలకు పెంచింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏడాది బకాయిల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బకాయిల్లో కేవలం 10 శాతం మాత్రమే విడుదల చేసింది. ఒక్కో ఆసుపత్రికి ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలానుగుణంగా ధరలను పునఃసమీక్షించడంతో పాటు బకాయిలు చెల్లించాలని యజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 31లోగా నిధుల విడుదల, ధరల పునఃసమీక్ష చేయని పక్షంలో 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తోంది. దీంతో కొన్ని ఆసుపత్రుల్లో రోగులను సదుపాయలు లేవన్న సాకుతో తిప్పిపంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆసుపత్రి నిర్వాహకులకు ఔషధాలు, వైద్యులు, నర్సుల జీతాలు, ఆసుపత్రి నిర్వహణ భారంగా పరిణమిస్తోందని అంటున్నారు. ధరల పెరుగుదలను అనుసరించి వైద్య చికిత్స ధరలను పెంచాల్సివుండగా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల, జర్నలి్‌స్టల ఆరోగ్య పథకం కింద 2 ఏళ్లకు పైగా బకాయీలు విడుదల చేయలేదని విమర్శిస్తున్నారు.

నూతనంగా మరో 163 వ్యాధులకు చికిత్సలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో 2007లో సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి, తెల్లరేషనకార్డు కలిగిన పేదలకు కొన్ని దీర్ఘకాలిక, ఖరీదైన వైద్యం పొందేందుకు వెసులుబాటు కల్పించారు. ఆయా ఖర్చులను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఆసుపత్రులకు విడుదలచేస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో 1,672 వ్యాధులకు చికిత్స అందించగా ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అదనంగా 163 వ్యాధులను కలిపి మొత్తంగా 1,835 రకాలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ కలిగిన ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సను పొందేవిధంగా అవకాశం పెంపొందించారు. డయాలసిస్‌ మొదలుకొని గుండెజబ్బుల వరకు ఆర్యోగ్యశ్రీ సేవలను విస్తరించారు. గతంలో రేషనకార్డు కలిగిన కుటుంబ సభ్యులందరికీ రూ.5 లక్షల్లోపు వైద్యం పొందే అవకాశం ఉండగా, ఆ మొత్తాన్ని ప్రస్తుతం రూ.10 లక్షలకు పెంచారు.

రెండేళ్లుగా పెండింగ్‌లోనే బిల్లులు

ఉద్యోగుల, జర్నలి్‌స్టల ఆరోగ్య పథకింద బిల్లులు 2023 నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. వైద్యం చేస్తే వచ్చే డబ్బుల కన్నా రోగి చికిత్సకు మందులు, శస్త్ర చికిత్స ఖర్చులకు డబ్బులు లేక కొన్ని ఆసుపత్రులు సౌకర్యాల లేమి పేరుతో రోగులను మరో చోటుకు పంపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నిర్వహించడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం బకాయిలు విడుదల చేయని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచఎ్‌స, జేహెచఎ్‌స సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సీఈవోకు నోటీసులు ఇచ్చాయి.

ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్ల వరకు బకాయీలు?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 56 ఆసుపత్రు ల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచఎ్‌స), జర్నలి్‌స్టల ఆరోగ్య పథకం(జేహెచఎ్‌స) కింద వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల, జర్నలి్‌స్టలకు వైద్యసేవలకు ప్రభుత్వం కొంతకాలంగా నిఽధులు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.100 కోట్ల వరకు ఉన్నట్లు వైద్యరంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. గత జనవరిలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి 10 శాతం నిధులు మాత్రమే విడుదల చేసినట్లు ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. చర్చల సందర్భంలో ప్రభుత్వం క్రమం తప్పకుండా బకాయిలు చెల్లింపు, ధరల పునరుద్ధరణ చేస్తామని మాట ఇచ్చి పాటించడం లేదని ఆరోపిస్తున్నారు.

నిధులు విడుదల చేయకుంటే సేవలు బంద్‌

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరో ఎనిమిది రోజుల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించనిపక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం. బకాయిలు క్రమం తప్పకుండా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీఇచ్చి పాటించడం లేదు. వైద్య చికిత్స ధరలను పునఃపరిశీలించాలి. ఈహెచఎ్‌స, జేహెచఎ్‌స బిల్లులు రెండు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలు విడుదల కాకుంటే ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మరుతోంది. ప్రభుత్వం సత్వరమే బకాయిలు విడుదలకు చర్యలు చేపట్టాలి.

- డా. మువ్వా రామారావు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హస్పిటల్స్‌ అసోసియేషన రాష్ట్ర కమిటీ సభ్యులు

Updated Date - Aug 23 , 2025 | 12:15 AM